రైతుల సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము లాభాల బాటలో పయనిస్తుందని పి ఎ సి ఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మండలంలోని సహకార సంఘం కార్యాలయంలో సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము నడవడానికి సహకరించిన రైతు సోదరులందరికీ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ గత సంవత్సరం కంటే 59,00,000/- లాభాలు రావడం గొప్ప శుభపరిణామం అన్నారు. ఇదే తీరులో మండల కేంద్రంలో పాలకవర్గం ఆధ్వర్యంలో ఒక కోటి రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. త్వరలోనే నూతన బ్రాంచి ఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము పరిధిలో సభ్యత్వం కలిగి రుణం పొంది ప్రమాదశవత్తు మృతి చెందిన గొడుగు లింగయ్య అనే రైతుకు సంఘము ద్వారా ఒక లక్ష రూపాయలు ప్రమాదభీమాను ప్రమాదభీమా పొందిన తన భార్య అయినా గొడుగు రాజమ్మకు వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమం వైస్ చైర్మన్ యధా కుమారస్వామి, డైరెక్టర్లు బొడ్డు లెనిన్, పోలుమారి విజయ, బిల్లా అమరేందర్ రెడ్డి, చాడ విజయ, మాచర్ల కానుకరాజ్, మురవత్ బిక్షపతి మడికండి రాజయ్య, శామాల రమేష్ రెడ్డి, జంగా వీరయ్య, PACS సెక్రటరీ P. రాజిరెడ్డి మరియు సంఘ సిబ్బంది, ఆవుల కుమారస్వామి, ch సురేఖ, కలకోటి మురళీకృష్ణ, బొడ్డు ప్రభుదేవ్, పోలుమారి ప్రవీణ్ కుమార్, మామిడాల రాజేందర్, రైతులు అమలీలు తదితరులు పాల్గొన్నారు.