– డీఎస్పీ రాష్ట్ర కమిటీ సభ్యులు గిరి మహారాజ్
నవతెలంగాణ-మర్రిగూడ
భారత రాజ్యాంగ గ్రంధాన్ని ప్రతి పౌరుడికి ఉచితంగా అందజేయాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గిరి మహారాజ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బుధవారం మర్రిగూడ మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడికి అందజేయాలని తెలియజేస్తూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగ గ్రంధాన్ని ప్రతి పౌరుడికి ఉచితంగా అందజేయాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రతి పౌరుడు తప్పనిసరిగా రాజ్యాంగ విలువలను తెలుసుకొని చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ మండల నాయకులు వినోద్ మహరాజ్ రాజ్, జగన్, సాయి, కొండల్ గౌడ్, వినరు, గిరి, గణేష్, శివ, రాజ్, నవీన్, చరణ్, శ్రవణ్, ప్రజాసంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.