ఇప్పటివరకు ఒక లెక్క..ఇకనుండి ఒక లెక్క

– పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒకరికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది
– విజయోత్సవ ర్యాలీలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
నవతెలంగాణ-బొమ్మలరామారం : కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన తర్వాత మొదటిసారిగా బొమ్మలరామారం మండల కేంద్రానికి విచ్చేసిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్యకు ఆదివారం కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీకి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు.చీకటిమామిడి నుండి అడుగడుగునా పూలతో జననిరాజనం పలికారు.బొమ్మలరామారం మండల కేంద్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండాలతో వాహనాలు కిక్కిరిచిపోయాయి.ఆయన వెంట ప్రజలు జనసందోహంతో రోడ్డులో బారులు తీరారు.యువత, నాయకులు, కార్యకర్తలు,ఐలయ్య అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ఓం శివ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ….బొమ్మలరామారం మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నన్ను అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు,పార్టీ శ్రేణులకు పేరుపేరునా రుణపడి ఉంటాను. మండలంలో కొన్ని దుష్ట శక్తులు అనేక రకాలుగా ప్రజలను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు దండుకోవాలని కుట్ర పన్నారు.కుట్రలను ఛేదించి ఆ దృష్టి శక్తులను తరిమికొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేశారు. కాంగ్రెస్ వాటిని గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డారని, గత 15 ఏళ్లగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కొంటున్న కష్టాలు నాకు తెలుసు.. కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ ఒక్క ప్రభుత్వ పథకం రాకుండా చేసిన బీఆర్ఎస్ నాయకుల కుత్రలు తెలుసు. ఇక రోజులు మారాయి.. ఇప్పుడు వరకు ఒక లెక్క ఇప్పుడు నుండి ఒక లెక్క.. పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.ప్రభుత్వ నిధులతో పాటు తన సొంత నిధుల ద్వారా మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటానని అన్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలంతా సముష్టిగా కృషి చేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని అన్నారు. మండలంలో 5000 పైన మెజార్టీని ఇచ్చి ఆశీర్వదించిన మండల ప్రజలకు రుణపడి ఉంటానని. ప్రతిరోజు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా తన విజయానికి కృషి చేసిన నాయకులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.