నవతెలంగాణ -డిచ్ పల్లి
శాస్త్ర సాంకేతిక రంగాన్ని భవిష్యత్ తరానికి అందించినప్పుడే దేశం అన్ని రంగాలలో ముందడుగు వేస్తుందని అందుకు ఈ మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జన్యు శాస్త్ర లో మార్పులు ఆరోగ్య రంగంపై మొబైల్ ఎగ్జిబిషన్ యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో జన్యు శాస్త్ర లో మార్పులు- ఆరోగ్య రంగంపై ప్రభావం అనే అంశంపై మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ ను ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్. ఎం యాదగిరి పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా రిజిస్ట్రార్ ఎం.యాదగిరి మాట్లాడుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటేక్నాలజీ ఆధ్వర్యం లో యువ సైంటిస్టులను తయారుచేసే మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ జీన్ హెల్త్ కనెక్ట్ నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఇందులో భాగంగా సీసీఎంబి హైదరాబాద్, విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజీ మ్యూజియం రిసోర్స్ పర్సన్స్ మానవ ఆరోగ్యానికి జన్యులతో ఉన్న నిర్మాణ సంబంధాన్ని కళ్ళకు కట్టినట్టుగా విద్యార్థులకు వివరించారు. ఈ ప్రదర్శనలో 20 రకాల జెన్యూ నమూనాలు, వీడియోలు విద్యార్థులను శాస్త్రీయంగా ఆలోచించే విధంగా ఉన్నాయని తెలిపారు. ఈ మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్లో ఎస్ ఎస్ ఆర్ డిగ్రీ కాలేజ్, జెడ్ పి హెచ్ ఎస్ సుద్దపల్లి, వందేమాతరం, ప్రెసిడెన్సి, విక్టరీ,కృష్ణవేణి టాలెంట్ తదితర పాఠశాలల నుండి సుమారుగా 800 మంది విద్యార్థులు పాల్గొని ప్రశ్నలు అడిగి అవగాహన పొందినారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ హారతి,బయోటెక్నాలజీ విభాగతిపతి డాక్టర్ జువెరియ ఉజ్మ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ మామిడాల, డాక్టర్ మహేందర్ రెడ్డి, డాక్టర్ కిరణ్మై డాక్టర్ ప్రసన్న షీలా, డాక్టర్ ప్రసన్న, రమేష్ నాయక్ మలవత్, సూపర్నెంట్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.