సిఎఫ్‌ఒలతోనే దేశం పురోగమనం

 సిఐఐ సమావేశంలో మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్‌ : దేశ పురోగమనంలో వివిధ సంస్థల్లో పని చేస్తున్న చీఫ్‌ ఫైనాన్సీయల్‌ ఆఫీసర్‌ (సిఎఫ్‌ఒ)లు పాత్ర కీలకమైందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. శుక్రవారం సిఐఐ ఆధ్వర్యంలో జరిగిన సిఎఫ్‌ఒ- 2023 సమావేశానికి ముఖ్య అతిథిగా హరీష్‌ రావు హాజరై మాట్లాడారు. ”సిఐఐ 4వ ఎడిషన్‌ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. సాంకేతికత, పరిశోధన, సుపరిపాలన ఈ మూడు అంశాలతో సభ నిర్వహించడం గొప్ప విషయం. సిఎఫ్‌ఒ సభ్యులుగా మీరు చేసే కృషి వల్ల సంస్థతో పాటు ఈ దేశం కూడా బలపడుతుంది. రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణ అంధ కారంలో ఉంటుందని అన్నవాళ్లే ఈరోజు తెలంగాణ మోడల్‌ అని అంటు న్నారు. మన ముఖ్యమంత్రి కెసిఆర్‌ గారు సిఎఫ్‌ఒ, సిఇఒగా, ముఖ్య మంత్రిగా పని చేశాడు కాబట్టి ఈరోజు తెలంగాణ అభివద్ధిని చూస్తుంది.” అని హరీష్‌ రావు అన్నారు. ”దేశం అభివృద్థి చెందుతోంది అంటే ఇతర దేశాల వారు మన దేశంలో పెట్టుబడులు పెడతారు. కానీ మన దేశంలోని ధనవంతులు ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారంటే మనం అభివృద్థి చెందుతున్నామా లేక వెనుకబడి పోతున్నామా అని దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వాలు ఆలోచించాలి.” అని పేర్కొన్నారు.