దేశం ఇంకా బతికే ఉంది
మానవత్వమే చచ్చిపోయింది
మంచివాడెవడో
పిచ్చి ముదిరిన వాడెవడో
తెలిసీ తెలియని వాడెవడో
తెలిసీ తెలియనట్టు
తెలియకపోయినా తెలిసినట్టు…
ఎవరెంతమందో
ఉట్టిపడుతున్న అజ్ఞానం
ఇదే భారతీయ సుజ్ఞానం
సిగ్గులేని ప్రచారకులు
నిర్లక్ష్యపు జనాలు
ఏది లౌకికమో..ఏది అలౌకికమో
ఏది సహజమో..ఏది అసహజమో
దారి చూపాల్సిన మార్గదర్శకులే
దారి తప్పితే
మార్గ మధ్యలో చీకటి కమ్మదా!?
తెల్లబారిన సమాజం ఫక్కున నవ్వదా…
ఇదే మా దారి, రహదారి అంటూ
తొడలు చరచుకున్నా
గుండెలు గుద్దుకున్నా
వాచేది వారికేనేమో!?
వెనకబడేది
నవ్వుల పాలయ్యేదీ దేశం.
– మహేశ్ దుర్గే
83339 87858