మండలకేంద్రంలోని పిన చెరువు వద్ద ఆవుపై మొసలి దాడిచేయడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింన ఘటన వెలుగు చూసింది. వివారాల్లోకి వెళితే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఏర్గట్ల గ్రామానికి చెందిన మునిమాణిక్యం చాకలి భూమేష్ కు చెందిన ఆవు మధ్యాహ్నం 1.30 సుమారులో పిన చెరువులో నీరు తాగడానికి వెళ్ళగా అక్కడే మాటు వేసిన మొసలి ఒక్కసారిగా ఆవుపై దాడిచేయడంతో ఆవు అక్కడికక్కడే మృతిచేందిందని, దాని వెంట ఉన్న లేగదూడ తప్పించుకుందని అన్నారు. భాధితుడు భూమేష్ మాట్లాడుతూ.. చెరువులో మొసలి ఉందని చాలా సార్లు అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపినా వారు పట్టించుకోలేదని, చెరువులో బట్టలు ఉతకాలంటే మాకు భయం వేస్తుందని అన్నారు. సుమారు 70 వేల రూపాయలు విలువచేసే ఆవు మృతిచేందడంతో భాదిత కుటుంబ సభ్యులు బోరున విలపించారు.