స్నేహితుల స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్

నవతెలంగాణ –  కమ్మర్ పల్లి 
మండలంలోని  కోనా సముందర్ గ్రామంలో మిలీనియం ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో స్నేహితుల స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. శనివారం ఈ క్రికెట్ టోర్నమెంట్ ను వైస్ ఎంపీపీ కాలేజ్ శేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మిలియన్ ఫ్రెండ్స్ సభ్యులు మునిగంటి గంగాధర్ మాట్లాడుతూ గ్రామంలో ప్రమాదవశాత్తు మరణించిన యాట రాజేష్, మనోహర్, గమ్మత్ రత్నాకర్ తమ స్నేహితుల స్మారకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. టోర్నమెంట్ విజేత జట్టుకు  మొదటి బహుమతిగా రూ.5వేలు, రన్నర్ జట్టుకు  రెండవ బహుమతిగా రూ.3వేలు అందజేయనున్నట్లు తెలిపారు. తమ స్నేహితుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహకులుగా రఘు, అజయ్, ప్రశాంత్ వ్యవహరిస్తున్నారు. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన గ్రామ సర్పంచ్ ఇంద్రాల రూప రాజు, ఉప సర్పంచ్ పేరం లింబాద్రి, సింగిల్ విండో చైర్మన్ సామ బాపురెడ్డి లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు క్రికెట్ ను ప్రారంభించి క్రీడాకారులను వైస్ ఎంపీపీ కాలేరు శేఖర్ పరిచయం చేసుకున్నారు. కాగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ గా హాస కొత్తూర్, కోనా సముందర్ జట్లు తలపడ్డాయి.