భిన్న కథతో తెర చాప

A curtain with a different storyనవీన్‌ రాజ్‌ సంకరపు, పూజా సుహాసిని, శ్రీలు కీలక పాత్ర ధారులుగా రూపొందుతున్న చిత్రం ‘తెరచాప’. జోయల్‌ జార్జ్‌ దర్శకత్వం వహి స్తున్న ఈ చిత్రాన్ని అనన్యా క్రియేషన్స, హరితవనం ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ పతాకాలపై కైలాష్‌ దుర్గం నిర్మిస్తు న్నారు. ఈ చిత్ర టైటిల్‌ను హీరో విశ్వక్‌సేన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ సినిమా కథ, కథనం, టేకింగ్‌, నిర్మాణ విలువలు అన్ని విషయాలు నాకు తెలుసు. టైటిల్‌ డిజైనింగ్‌ చాలా బావుంది. సినిమా బాగా ఆడి, మంచి విజయాన్ని ఈ టీమ్‌కి అందించాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు. జగదీష్‌ ప్రతాప్‌ బండారి, రాజీవ్‌ కనకాల, రాకీ, నాగ మహేష్‌, పధ్వీరాజ్‌జి, ఫిష్‌ వెంకట్‌, అశోక్‌ జబర్దస్త్‌, నాగి జబర్దస్త్‌, అప్పారావు జబర్దస్త్‌, రైజింగ్‌ రాజు, రాజేష్‌ భూపతి, శ్రీనివాస్‌జి, మాయ మశ్చీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత : కైలాష్‌ దుర్గం, సంగీతం: ప్రజ్వల్‌ క్రిష్‌, మాటలు – పాటలు : మిద్దె మనోజ్‌కుమార్‌, కెమెరా: అజీమ్‌ – వెంకట్‌, ఎడిటర్‌: బొడిసింగి రాజు.