– కేేరళ పట్ల కత్తిగట్టిన కేంద్రం : ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ విమర్శ
తిరువనంతపురం : ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రాష్ట్రం తీసుకునే రుణం మొత్తాన్ని భారీగా తగ్గించేసి కేరళను కేంద్ర ప్రభుత్వం ఊపిరాడకుండా చేస్తోందని కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వ శత్రుపూరిత వైఖరికి ఇదొక నిదర్శనమని ఆయన అన్నారు. కనీసం ఏడు వేల కోట్ల రూపాయలు వస్తాయని భావించగా, రూ.1838 కోట్లు మాత్రమే తీసుకునేందుకు అనుమ తించారు. కేంద్ర ప్రభుత్వం తీరు ఆందోళనకరంగా ఉందని, సంక్షోభాన్ని అధిగమిం చేందుకు రాష్ట్రం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈచర్య కేరళ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని బాలగోపాల్ పేర్కొన్నారు. ఏటా చివరి త్రైమాసి కంలో ఎక్కువ డబ్బు అవసరమయ్యే సమయం. ఒక్క మార్చిలోనే రూ.20 వేల కోట్లు కావాలి. రాజ్యాంగం ప్రకారం, ఫైనాన్స్ కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్రానికి రావాల్సిన మొత్తంలో కోత విధించారు. ట్రెజరీతో సహా పబ్లిక్ ఖాతా పేరుతో తగ్గింపులు జరుగుతాయి. పబ్లిక్ ఖాతాలో డబ్బు లేదు, ఇంకా కట్ చేయబడింది. ఇది రాష్ట్రం యొక్క అన్ని ఆర్థిక గణనలను ప్రభావితం చేస్తుంది. జీతం, పెన్షన్, వైద్య సహాయం, సామాజిక పెన్షన్, నిర్మాణ పనులతో సహా రోజువారీ విషయాల కోసం కేరళ కష్టపడుతోంది. తగిన మొత్తంలో రుణం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మళ్లీ కేంద్రాన్ని సిఎం, ఆర్థిక మంత్రి ఆశ్రయించనున్నారు. కేంద్ర ప్రభుత్వం విరోధభావంతో వ్యవహ రించ కూడదు. పన్నులో సరైన వాటా కూడా చెల్లించడం లేదు. దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రపంచంలోని ఇతర రాష్ట్రాలు, దేశాల ముందు కేరళ ఆదర్శప్రాయమైన విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతోంది. రాష్ట్రం ఒక్కటే ఇంత చేయలేం. రాష్ట్రాలు మొత్తం వ్యయంలో 65 శాతం భరించాలి. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను సులభతరం చేసేందుకు కృషి చేయాలని ఆర్థిక మంత్రి అన్నారు.