సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు 

A day worth writing in golden letters

– కాంగ్రెస్ నాయకులు, ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ 

– పార్టీ ఆదేశిస్తే వాచ్మెన్ పదవి అయినా చేస్తా
– రుణమాఫీ సందర్భంగా సంబరాలు
నవతెలంగాణ – సిద్దిపేట
రైతు రుణమాఫీ చేసిన ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అని, రాష్ట్రమంతటా పండగ వాతావరణం చోటుచేసుకుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ అన్నారు. రైతు రుణమాపి చేసిన సందర్భంగా  వేములవాడ కమాన్ వద్ద టపాసులు కాల్చి, సీఎం చిత్రపటానికి నాయకులు పాలాభషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం  ప్రతిపక్షాలకు చెంప దెబ్బ లాంటిది అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తో సాధ్యమైన రుణమాఫీ నేడు రేవంత్ రెడ్డి తోనే సాధ్యమైందని అన్నారు. స్పీకర్ ఫార్మేట్ లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తను మాట్లాడిన మాటలు తప్పయిందని, ముక్కు నేలకు రాయాలని కోరారు. తాను స్థాపించిన ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ కూడా రైతుల కోసం పనిచేశామని, బాధిత రైతు కుటుంబాలకు రూ లక్ష రూపాయల చొప్పున సహాయం చేశామని అన్నారు. ఆ ప్రభుత్వం రైతులకు సహాయం చేస్తే జైలు పాలు చేసిందని, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ లో చేర్చుకొని, ఆహ్వానించింది అన్నారు. హరీష్ రావు మాటమీద నిలబడే వ్యక్తి కాదని, ఆయన రాజీనామా చేయాలని అన్నారు. సిద్దిపేటలో గ్రూప్ రాజకీయాలు లేవని, అందరము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నామని, తాను కూడా నామినేటెడ్ పోస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నానని, పార్టీ ఆదేశిస్తే వాచ్మెన్ పదవి అయినా చేస్తానని అన్నారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శివప్ప మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 రైతు రుణమాఫీ చేస్తాను అని చెప్పి, 25 రోజుల ముందే ఆ పనిని ప్రారంభించాడని, ప్రతిపక్షాలు విమర్శించడం మంచిది కాదన్నారు. అందరికీ ఆదర్శంగా సీఎం నిలిచాడని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అశోక్, శివప్రసాద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.