క్యాబినెట్‌లో గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టుల పెంపుపై నిర్ణయం తీసుకోవాలి

– విద్యార్థి, నిరుద్యోగ నాయకులు శివానందస్వామి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టుల పెంపుపై శనివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని విద్యార్థి, నిరుద్యోగ రాష్ట్ర నాయకులు మఠం శివానంద స్వామి ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ఇచ్చిన హామీ నిలబెట్టుకో వాలని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందుకను గుణంగా గ్రూప్‌-2, గ్రూప్‌-3 నోటిఫికేషన్లలో పోస్టుల ను అదనంగా కలపాలని కోరారు. గ్రూప్‌-4లో అదనంగా పోస్టులను కలిపే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.