కేటీఆర్‌ బామ్మర్ది డ్రగ్స్‌ పార్టీపై లోతైన విచారణ జరపాలి

– ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మాజీ మంత్రి కేటీఆర్‌ బామ్మర్ది ఫామ్‌ హౌస్‌ డ్రగ్స్‌ పార్టీపై లోతైన విచారణ జరపాలని ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా ఉంచాలని సీఎం రేవంత్‌రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. కేటీఆర్‌ బామ్మర్ది రాజ్‌ పాకాల తన స్వంత ఫామ్‌ హౌస్‌లో డ్రగ్స్‌, విదేశీ మద్యంతో పార్టీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇది రాష్ట్రంలో డ్రగ్స్‌ మాఫియాను ప్రోత్సహించేలా ఉందని ఆరోపించారు. ఈ డ్రగ్స్‌ పార్టీలో ఎంత పెద్ద వారైన వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి మంచి భవిష్యత్తుతో బాగుండాలని సీఎం రేవంత్‌రెడ్డి అనేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఇలాంటి తరుణంలో కేటీఆర్‌ అండ్‌ బ్యాచ్‌ ఇలా రాష్ట్రాన్ని డ్రగ్స్‌స్టేట్‌గా చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో యువత ఆలోచించి ఎవరి పక్షానా ఉంటారో నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు.