– జింక పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారుల తీవ్రప్రయత్నాలు
– గతంలో రోడ్లపై వచ్చి కుక్కల దాడిలో రెండు జింకలు మృత్యువాత
– 10రోజుల క్రితమే ఫారెస్టులో వదిలిన అటవీశాఖాధికారులు
– ఆహారం దొరక్క రోడ్ల బాట పడుతున్న జింకలు
– కుక్కల కంట్లో పడితే అంతే సంగతులు
– అసహనం వ్యక్తం చేస్తున్న జంతు ప్రేమికులు
నవతెలంగాణ:నాగార్జునసాగర్
అమ్రాబాద్ ఫారెస్ట్ రేంజ్ లోని నాగార్జునసాగర్ ఏకో ఫారెస్ట్ అర్బన్ పార్కు నుంచి ఒక జింక రోడ్డెక్కింది.శనివారం ఉదయం పైలాన్ కాలనిలో బైపాస్ సమీపంలో చెంగుచెంగున జింక పరుగులు పెట్టింది.జింకను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు జింకను పట్టుకునేందుకు పరుగులు పెట్టారు. హుషారుగా పరుగెడుతున్న జింకను చూసి స్థానికులు, రోడ్డున వెళ్లే ప్రయాణికులు తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు.అరణ్యంలో ఉండాల్సిన జింకలు రోడ్లపై రావడాన్ని కారణం అటవి శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పాటు సంరక్షణ లోపంతో వన్యప్రాణులు కాస్తా రోడ్డుపైకి వచ్చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదైనా వాహనం కింద పడితే పరిస్థితి ఏంటీ అని వన్య ప్రాణా సంరక్షకులు నెట్టింటా ప్రశ్నలు గుప్పిస్తున్నారు. గతంలో కూడా రోడ్లపై వచ్చి కుక్కల దాడిలో రెండు జింకలు మృతి చెందిన విషయం తెలిసిందే.ఈప్పటికైనా అటవీశాఖ అధికారులు జింకల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు,జంతు ప్రేమికులు కోరుతున్నారు.