జూనియర్ కళాశాలలోనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి..

– పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయినాథ్ డిమాండ్..
నవతెలంగాణ -డిచ్ పల్లి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ యు నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను డిచ్ పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేయాలని వందలాద మంది విద్యార్థులతో జూనియర్ కళాశాల నుండి తహసీల్లార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి సీనియర్ అసిస్టెంట్ మోహమ్మద్ షఫీ కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ యు డివిజన్ కమిటీ నాయకుడు సాయినాథ్ మాట్లాడుతూ డిగ్రీ కళాశాల కోసం పీడీఎస్ యు ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశామని, కళాశాలను మంజూరు  చేయించిన ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు ధన్యవాదాలు తెలుపుతూన్నమని వివరించారు. డిగ్రీ కళాశాల సీఎంసీ దగ్గర ఏర్పాటు చేస్తే అక్కడ అమ్మాయిలకు భద్రత  ఉండదన్నారు. జాతీయ రహదారి 44  ఉండటంతో వాహనాలు వేగంగా వస్తాయని, దింతోపాటు రాకపోకలు సాగించే సమయంలో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని, పేద విద్యార్థులకు చాలా ఇబ్బందిగా ఉంటుందని, చుట్టూపక్కల గ్రామాల నుండి వచ్చే విద్యార్థులు మళ్లీ డబ్బులు పెట్టి వెళ్లాలంటే వెళ్లలేరన్నారు. డిగ్రీ కళాశాల డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ లోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు భద్రత  ఉంటుందని,ఇదే కాకుండా విద్యార్ధులకు అందుబాటులో ఉంటదన్నారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడే ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో పీడీఎస్ యు జిల్లా నాయకులు పవన్, సునీల్, నరేష్, అరుణ్, విద్యార్థులు పాల్గొన్నారు.