ఆమాంతం పెరిగిన కంది ధర

– సంతోషంలో రైతన్నలు

నవతెలంగాణ – జుక్కల్ : కంది పంట ధర ఆమాంతం పెరుగుతుండటంతో సామాన్యులకు కంది పప్పు ఇక తినడం కష్ట సాద్యంగా ఉండబోతోందని  మద్యతరగతి ప్రజలు కుటుంబాల వారు అందోళన చెందుతున్నారు. మండలంలోని కంది సుమారుగా ఏడు వేల ఎకరాలలో కంది పంట సాగు చేస్తున్నారు. ఎన్నొ ఒడిదుడుకులు ఎదుర్కోని ఎకరాకు సుమారుగా ఇరువై వేల పెట్టు బడి పెట్టి పంటను సాగు చేసారు. ప్రస్తుతం బహిరంగ మార్కేట్ లో క్వింటాకు పదకొండు వేలకు పైచిలుకు ప్రయివేటు వ్యాపారస్తులు కొనుగోలు చేస్తుండటంతో దిగుబడి తగ్గిన మంచి ధర వస్తుండటంతో రైతన్నలో కళ్లలో సంతోషం కనిపిస్తోంది. కందులకు భారీగా ధర పదవేలు ఆపై పలకడం మెుదటిసారి కావడం వలన రైతులు సంతోషంలో ఉన్నారు. ఇక పైన  రైతు పంటలకు గుట్టుబాటు ధర మినిమమ్ ధరలు ఉంటే రైతు రారాజు కావడం ఖాయం. ఈ ఏడు పంట రండిన మెుదట్లో అమ్ముకున్న వారు తగిన రేటు వచ్చినప్పడికి , అప్పుడప్పుడు హెచ్చుతగ్గులు అవుతున్నాయి. దీంతో రైతులకు అనుమానాలు రేకెత్తి ఎప్పుడు పెరుగుతుందో, తగ్గుతుందో అందోళనలో అమ్మడమే బెటర్ అని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ సారీ ఖర్చులు ఎక్కువే
కంది పంటకు సాగురైతుకు ఖర్చులు విపరితంగా పెరిగాయి. దీనికి తోడు పంట దిగుబడి తగ్గింది. ధర సూపర్ గా ఉండటంతో మేలు జరిగింది. ఇప్పడికే ఎకరాకు ఇరువై నుండి ముప్పై వేలు ఖర్చు పెట్టినట్టు రైతులు తెలిపారు.
సామాన్యులకు కష్టమే
అప్పుచేసి పప్పు కూడు అనే చందంగా పేద, మద్య  తరగతి వారికి అందని ద్రాక్షగా మారింది. బహిరంగ మార్కేట్ లో కంది పప్పు ఒక కేజీ నూట యాబై నుండి రెండువందలు బహిరంగ మార్కేట్ లో దొరుకుతుంది.