ప్రభుత్వ పాఠశాలలో రుచికరమైన భోజనం

A delicious meal in a government schoolనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు రుచికరమైన భోజనం అందిస్తున్నారని, వాటి రుచులను పరిశీలించేందుకుగాను పోటీలను నిర్వహించామని డీఈఓ ప్రణీత తెలిపారు. ఆదివారం డైట్ కళాశాల ఆవరణలో ప్రధాన మంత్రి పోషన్ అభియాన్ లో భాగంగా మధ్యాహ్న భోజన నిర్వాహకులకు భోజన నాణ్యత పోటీలను నిర్వహించారు. ఆయా పాఠశాలలకు చెందిన నిర్వాహకులు వారి వెంట తీసుకువచ్చిన సామాగ్రితో వంటలు చేశారు. అనంతరం డీఈఓ న్యాయనిర్ణేతలుగా ఉన్న వారు వాటి రుచులను చూశారు. అనంతరం ఎంపికైన వారికి మొదటి బహుమతి రూ.15 వందలు, రెండవ బహుమతి రూ. వెయ్యి, మూడవ బహుమతి రూ.500 అందించనున్నామని డీఈఓ తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ ప్రణీత మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మరింత నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి పోషన్ అభియాన్ పోటీలు జరిగాయన్నారు. ఈ పోటీల్లో నిర్వాహకులు మంచి రుచికరమైన భోజనాన్ని తయారు చేశారన్నారు. ఇలానే ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనాన్ని విద్యార్థులకు వడ్డించాలని సూచించారు. జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన వారికి నగదు రివార్డును అందించామని తెలిపారు. త్వరలో జరిగే రాష్ట్రస్థాయికి కూడా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా పాల్గొన్న మిగిత వారికి కూడా ప్రోత్సహకంగా నగదును అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైట్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ కిరణ్, జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, కంటే నర్సయ్య, పాల్గొన్నారు.