మెప్పించే రత్నం

మెప్పించే రత్నంహీరో విశాల్‌ ప్రస్తుతం ‘రత్నం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తికేయన్‌  సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యాక్షన్‌ డైరెక్టర్‌ హరి దర్శకత్వంలో శ్రీ సిరి సాయి సినిమాస్‌ బ్యానర్‌ మీద తెలుగులో సీహెచ్‌ సతీష్‌ కుమార్‌, కే రాజ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో విశాల్‌కి జోడిగా ప్రియా భవాని శంకర్‌ నటించారు. ఈ సినిమా ఈనెల 26న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి మంచి మెలోడియస్‌, ఎమోషనల్‌ సాంగ్‌ ‘చెబుతావా’ను రిలీజ్‌ చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం, సింధూరి విశాల్‌ గాత్రాన్ని అందించారు. దేవీ శ్రీ ప్రసాద్‌ ఇచ్చిన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. కళ్యాణ్‌ సుబ్రహ్మణ్యం అలంకార్‌ పాండియన్‌ కో-ప్రోడ్యుసర్‌గా రాబోతోన్న ఈ మూవీకి ఎం సుకుమార్‌ కెమెరామెన్‌గా, టీ ఎస్‌ జై ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.