వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రా లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్ ‘అతిథి’. రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దర్శకుడు భరత్ వైజీ దీన్ని రూపొందించారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో రన్నర్‌గా వ్యవహరించారు. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 19 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌లోని ఫస్ట్ రెండు ఎపిసోడ్స్‌ను మీడియాకు ప్రత్యేకంగా ప్రివ్యూ వేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు భరత్ వైజీ మాట్లాడుతూ, ‘ఈ వెబ్ సిరీస్ కథకు నా రియల్ లైఫ్‌లో చూసిన ఒక ఇన్సిడెంట్ స్ఫూర్తినిచ్చింది. వేణు పర్‌ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇది అండర్ కరెంట్‌గా హర్రర్ ఉంటూ ఎంటర్‌టైన్ చేస్తుంది’ అని అన్నారు. ‘ఈ వెబ్ సిరీస్ ఇంత బాగా వచ్చిందంటే ఆ క్రెడిట్ నేను టెక్నీషియన్స్‌కు ఇస్తాను. ఇందులో హర్రర్, కామెడీ ఇవన్నీ పక్కన పెడితే అందరూ కలిసి హాయిగా చూడగలిగే కథ ఇది’ అని హీరో వేణు చెప్పారు.