మెప్పించే రాజా..రమ్యం

విగేష్‌ రెడ్డి గవి, శ్రీ ఆశ్రిత జంటగా నటిస్తున్న సినిమా ‘రాజా రమ్యం’. విలేజ్‌ డ్రామా కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రనిల్‌ గౌరీ పాగ రూపొందిస్తున్నారు. గావి ఫిలిమ్స్‌, సిల్లీ మాంక్స్‌ స్టూడియోస్‌ పై కోకొండ జయచందర్‌ రెడ్డి, సంజరు రెడ్డి, అనిల్‌ పల్లాల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఏమి పాపం..’ అనే లిరికల్‌ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు సంగీత దర్శకుడు చరణ్‌ అర్జున్‌ సాహిత్యాన్ని అందించడంతో పాటు పాడటం విశేషం. హార్ట్‌ టచింగ్‌ లిరిక్స్‌, ట్యూన్‌తో సాగే ఈ పాట అందర్నీ విశేషంగా అలరించడం ఖాయం. ప్రస్తుతం షూటింగ్‌ తుది దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందు కొచ్చేందుకు సిద్ధమవుతోంది.