మెప్పించే సరికొత్త ప్రేమకథా చిత్రం

A delightful new love story movieఉదయ్‌ రాజ్‌ హీరోగా, భామ వైష్ణవి సింగ్‌ హీరోయిన్‌గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై రాజేష్‌ చికిలే దర్శకత్వంలో యం.బంగార్రాజు నిర్మిస్తున్న టీనేజ్‌ లవ్‌స్టోరీ ‘మధురం’. సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. దర్శకుడు రాజేష్‌ చికిలే మాట్లాడుతూ,’ఈ సినిమా 1990 నేపథ్యంలో జరిగే ఒక టీనేజ్‌ లవ్‌ స్టోరీ. అప్పటి స్కూల్‌ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. యూత్‌ఫుల్‌ ఎంటర్టైన్మెంట్‌తో పాటు క్యూట్‌ లవ్‌స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతుంది. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొం దించాం. మా నిర్మాత బంగా ర్రాజు అనుకున్న బడ్జెట్‌ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని చాలా రిచ్‌గా నిర్మించారు’ అని తెలిపారు. ‘మా దర్శకుడు రాజేష్‌ చెప్పిన కథ అధ్భుతంగా నచ్చింది.. కొత్తదనం ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.. అలాగే మా సినిమా కూడా చాలా కొత్తగా, నేటి తరానికి కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. కచ్చితంగా చాలా పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకం మాకు ఉంది. మా సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను హీరో విశ్వక్‌ సేన్‌ రిలీజ్‌ చేశారు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సమ్మర్‌లోనే సినిమాని రిలీజ్‌ చేస్తాం’ అని నిర్మాత యం. బంగార్రాజు అన్నారు.