నవతెలంగాణ- ఆర్మూర్: రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో అధ్యక్షులు పట్వారి గోపికృష్ణ అధ్యక్షతన “ఓటు ఒక వజ్రాయుధం” కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ చేతుల మీదుగా సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు నవంబర్ 30న ఓటు హక్కును వినియోగించుకొవాలని కోరారు, ఓటు పైన అవగాహన కలిపిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పట్వారీ తులసి, కాంతి గంగారెడ్డి, ప్రవీణ్ పవార్, శశిధర్, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.