‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’, ‘ఏ మాస్టర్ పీస్’ వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దష్టిని ఆకట్టుకున్న దర్శకుడు పూర్వాజ్ ‘కిల్లర్’ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని పూర్వాజ్ ప్రజరు కామత్, ఎ. పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ కలయికలో నిర్మాణ మవుతున్న రెండవ చిత్రమిది.
శుక్రవారం ‘కిల్లర్’ పార్ట్ 1 – డ్రీమ్ గర్ల్ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. విడుదలైన ప్రతి పోస్టర్‌తో ఈ మూవీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది అని మేకర్స్ తెలిపారు. జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – జగదీశ్ బొమ్మిశెట్టి, మ్యూజిక్ – అషీర్ ల్యూక్, సుమన్ జీవరత్నం, రచన-దర్శకత్వం :పూర్వాజ్.