నందమూరి బాలకష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో గ్రాండ్‌గా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తన నటనతో అలరించడానికి నటన, ఫైట్లు, డ్యాన్స్‌లలో మోక్షజ్ఞ ట్రైనింగ్ తీసుకున్నారు. ఎం. తేజస్విని నందమూరి ప్రెజెంటర్‌గా, లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేసిన ఈ చిత్రం ఇప్పటికే హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. పౌరాణిక, ఇతిహాసం నుంచి ప్రేరణ పొందిన ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు. నందమూరి నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఈ సినిమా పై అటు అభిమానుల్లోను, ఇటు ప్రేక్షకుల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.