భిన్న కాన్సెప్ట్‌

A different conceptహీరో నాగ శౌర్య తన నూతన చిత్రాన్ని కొత్త దర్శకుడు రామ్‌ దేశిన (రమేష్‌) దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిలింస్‌ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నయా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌ సీక్వెన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 60శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ‘పవర్‌ఫుల్‌ కంటెంట్‌తో ఈ కథని నూతన దర్శకుడు రామ్‌దేశిన రాసుకున్న విధానంగా చాలా బాగుంది. ఇప్పుడొస్తున్న సినిమాల మాదిరిగా కాకుండా ప్రతీదీ చాలా డిఫరెంట్‌గా ఉండేలా ఆయన డిజైన్‌ చేసుకున్నారు. ఈ ఫ్రెష్‌నెస్‌ కచ్చితంగా స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. అలాగే హీరో నాగశౌర్య పోషించిన పాత్రలతో పోలిస్తే ఇందులో ఆయన పాత్ర సైతం చాలా వినూత్నంగా ఉంటుంది. ఇది తప్పకుండా ఆయన కెరీర్‌కి బాగా ఉపయోగపడే పాత్రగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. ఆద్యంతం ప్రేక్షకులను అలరించే అన్ని ఎలిమెంట్స్‌ ఇందులో ఉన్నాయి’ అని నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు తెలిపారు. సముద్రఖని, రాజేంద్రప్రసాద్‌, సాయికుమార్‌, మైమ్‌ గోపి, శ్రీదేవి విజరు కుమార్‌, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ, పథ్వి, అజరు, ప్రియ, నెల్లూరు సుదర్శన్‌, కష్ణుడు, చమక్‌ చంద్ర, శివన్నారాయణ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి డీవోపీ: రసూల్‌ ఎల్లోర్‌, సంగీతం: హారిస్‌ జైరాజ్‌, ఆర్ట్‌: రాజీవ్‌నాయర్‌, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, పథ్వీ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యుసర్‌: సుధాకర్‌ వినుకొండ.