హన్సిక హీరోయిన్‌గా రాజు దుస్సా దర్శకత్వంలో రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్, మాంక్ ఫిలిమ్స్ పతాకాలపై బొమ్మక్ శివ నిర్మిస్తున్న సినిమా ‘105 మినిట్స్’. గతంలో విడుదలైన మోషన్, పోస్టర్ థీమ్ సాంగ్‌కి మంచి స్పందన లభించగా ఇప్పుడు విడుదలైన ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచేస్తోంది. వినూత్న రీతిలో హన్సిక సినిమాలో చేసిన అదే క్యారెక్టర్ గెటప్‌లో స్టేజ్ పైకి వచ్చి ట్రైలర్‌ని రిలీజ్ చేయడం చాలా కొత్తగా అనిపించింది. ఒకే క్యారెక్టర్ని ఒకే షాట్లో చిత్రీకరించబడిన మొట్టమొదటి ప్రయోగాత్మక చిత్రంగా దీన్ని నిర్మించారు. పనోరమ స్టూడియో ద్వారా ట్రైలర్ రిలీజ్ చేయటంతోపాటు ఈనెల 26న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఈ సందర్భంగా కో ప్రొడ్యూసర్ సుమన్ మాట్లాడుతూ, ‘మంచి కంటెంట్ ఉన్న థియేటర్ సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులోనే వరల్డ్ వైడ్ రిలీజ్ చేసి తర్వాత డిఫరెంట్ లాంగ్వేజస్‌లో పాన్ ఇండియా లెవెల్‌లో తీసుకొస్తాం’ అని తెలిపారు. ‘ఈనెల 26న ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాం’ అని దర్శకుడు రాజు దుస్సా అన్నారు. హీరోయిన్ హన్సిక మాట్లాడుతూ, ‘ఇదొక కంప్లీట్ ఎక్స్‌పరిమెంటల్ ఫిలిం. 34 నిమిషాల షాట్‌ని సింగిల్ టేక్‌లో చేయడం అనేది నాకు ఒక కొత్త అనుభూతినిచ్చింది. ఇలాంటివి ఈ సినిమాలో చాలా ఉన్నాయి’ అని అన్నారు.