కిషోర్ కేఎస్ డి, దియా సితెపల్లి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ప్రేమకథ’. టాంగా ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్ పీ, సినీ వ్యాలీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజరు మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ నిర్మాతలు. ఉపేందర్ గౌడ్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శివశక్తి రెడ్ డీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను డైరెక్టర్ హరీశ్ శంకర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ బాగుందని, సినిమా సూపర్ హిట్ కావాలని మూవీ టీమ్‌కు ఆయన బెస్ట్ విషెస్ తెలిపారు. వైవిధ్యమైన లవ్ స్టోరీతో నేటితరం యువ ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. రాజ్ తిరందాసు, వినరు మహదేవ్, నేత్ర సాధు తదితరులు నటిస్తున్నారు.