సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా జెనిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించిన సినిమా ‘ఇవోల్’. (ఏ లవ్‌స్టోరీ ఇన్ రివర్స్) అనేది క్యాప్షన్. ఈ టైటిల్‌ని రివర్స్‌లో చూస్తే లవ్ అని ఉండటం విశేషం. టైటిల్ మాదిరిగానే ఈ సినిమా కూడా ఒక రివర్స్ లవ్ స్టోరీగా మన ముందుకు రాబోతుంది.
తాజాగా విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో నిర్మాత, డైరెక్టర్ రామ్ యోగి వెలగపూడి మాట్లాడుతూ, ‘తేడా బ్యాచ్ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్ ల్యాబ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉంది. ఇద్దరు స్నేహితుల మధ్య అండర్‌స్టాండింగ్ నేపథ్యంలో సాగే కథ అని. సినిమా డిఫరెంట్ అంశాలు, వాణిజ్య విలువలతో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కి, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ చిత్రాన్ని హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. సెన్సార్ పూర్తి చేసుకున్న మా చిత్రం ‘ఎ’ సర్టిఫికేట్‌ని సొంతం చేసుకుంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం’ అని తెలిపారు.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: సునీల్ కశ్యప్, కెమెరా: తేడా బ్యాచ్ సినిమా టీమ్, ఎడిటర్: విజరు, కళ: యోగి వెలగపూడి, కొరియోగ్రాఫర్: జిన్నా కథ-స్క్రీన్ ప్లే-మాటలు-నిర్మాత-దర్శకత్వం: రామ్ యోగి వెలగపూడి.