సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్ర ధారులుగా నటిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘వెపన్’. మిలియన్ స్టూడియో బ్యానర్ పై గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర గ్లింప్స్‌ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా సత్యరాజ్ మాట్లాడుతూ, ‘ఇదొక డిఫరెంట్ కాన్సెప్ మూవీ. నిర్మాతలైతే మరో ఆలోచన లేకుండా ఖర్చు పెట్టి సినిమాను అద్భుతంగా రూపొందిస్తున్నారు. డైరెక్టర్ గుహన్ సరికొత్త విజన్‌తో సినిమాను ఆవిష్కరించారు’ అని తెలిపారు. నిర్మాత మన్సూర్ మాట్లాడుతూ, ‘మా బ్యానర్‌లో వస్తోన్న తొలి సినిమా. అవుట్ అద్భుతంగా వస్తోంది’ అని అన్నారు. దర్శకుడు గుహన్ సెన్ని యప్పన్ మాట్లాడుతూ, ‘డీసీ, మార్వెల్ తరహా సూపర్ హ్యుమన్స్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఇందులో వండర్ పుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. సినిమాను కేరళలోని వాగమన్‌లో చిత్రీకరించాం. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిర్మాత సహకారంతో సినిమా అద్భుతంగా వస్తోంది’ అని చెప్పారు.