భారత్ బంద్ లో అపశ్రుతి.. యువకుడిపై కత్తితో దాడి

Disagreement in Bharat Bandh.. Knife attack on youthనవతెలంగాణ – అమరావతి: ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలో ‘భారత్ బంద్’ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ పలు దళిత సంఘాల నాయకులు బంధంచర్ల గ్రామంలో పర్యటించారు. షాపులు మూసేసి బంద్‌‌కు సహకరించాలని కోరారు. ఈ క్రమంలో స్థానిక హోటల్ యజమానితో నిరసన చేస్తున్న ఓ యువకుడికి వాగ్వాదం చెలరేగింది. దీంతో హోటల్ యజమాని కత్తితో అతనిపై దాడి చేశాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.