– శాంతింప చేసిన దేవాలయ ఈవో..
నవతెలంగాణ – వేములవాడ
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో సోమవారం నుండి విఐపి బ్రేక్ దర్శనాల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో బ్రేక్ దర్శనాల ప్రారంభోత్సవానికి స్థానిక బిఆర్ఎస్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులను, బిజెపి నాయకులను ఆహ్వానించకపోవడంతో స్థానిక బిజెపి, బీఆర్ఎస్ నాయకులు ఈవో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అధికారంలో ఉన్న అధికార పార్టీ నాయకులను ఆహ్వానిస్తారా..? అంటూ దేవాలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఈ విషయం తెలుసుకొని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్థానిక బిఆర్ఎస్ ,బిజెపి నాయకులను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అధికారులు వచ్చి రమ్మని కోరిన ప్రారంభోత్సవంలో పాల్గొనలేదు. అనంతరం దేవాలయ ఈవో నిరసన తెలుపుతున్న బిజెపి, బిఆర్ఎస్ నాయకులను పొరపాటు జరిగింది.. దయచేసి క్షమించండి మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని వారికి నచ్చ చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ నాయకులు స్థానిక కౌన్సిలర్లు నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నిమ్మశెట్టి, గోలి మహేష్, సిరిగిరి రామ్ చందు, నాయకులు రేగుల మల్లికార్జున్, కందుల క్రాంతి, తో పాటు తదితరులు పాల్గొన్నారు.