
మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో ఇటీవల కాలంలో గ్రామానికి చెందిన మల్లయ్య హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో మరణించారు.మల్లయ్య మరణించిన అనంతరం అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు జీవన్దాన్ సంస్థ ప్రతినిధి శివకుమార్ మల్లయ్య భార్యకు శుక్రవారం అవయవ దానం చేసినందుకు పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, సొసైటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, నాయకులు లింగారెడ్డి, స్వామి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.