ఆరుట్ల నుంచి బండ లేముర్‌ వరకూ డబుల్‌ బీటీ రోడ్డు వేయాలి

– బండ లేముర్‌ సర్పంచ్‌ పాతులోత్‌ మంగ శ్రీనివాస్‌
నవతెలంగాణ-మంచాల
ఆరుట్ల నుంచి బండలేముర్‌ వరకు డబుల్‌ బీటీ రోడ్డ్డు, బండ లేమూర్‌ నుంచి పొర్లగడ్డ తండా వరకూ నూతన బీటీ రోడ్డు వేయాలని బండ లేమూర్‌ సర్పంచ్‌ పాతులోత్‌ మంగ శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో జెడ్పీటీసీ మర్రి నిత్య నిరంజన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరుట్ల నుంచి బండ లెముర్‌ వరకూ ఉన్న బీటీ రోడ్డంతా గుంతల మయంగా మారిందన్నారు. ప్రస్తుతం వర్షాకాలమని వర్షాలు పడితే గుంతలు పడిన రోడ్డుపై ప్రయాణికులకు ఇబ్బంది తొలగించేందుకు బీటీ రోడ్డును నిర్మించాలని కోరారు. దానితో పాటు బండలేమూర్‌ నుంచి పార్ల గడ్డతండా వరకు మొత్తం మట్టి రోడ్డు ఉండటంతో గత వారం రోజుల నుంచి వర్షాలు రావడంతో మట్టి రోడ్డు అంత పాడై పోయిందన్నారు. ఈ సమస్యల పై పలు మార్లు అధికారులకు వినతిపత్రం అందించినట్టు గుర్తు చేశారు. జెడ్పీటీసీ మర్రి నిత్య నిరంజన్‌ రెడ్డికి కూడా వినతి పత్రం అందించినట్టు తెలిపారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, బీటీ రోడ్లును నిర్మించాలని కోరారు. లేనియేడల కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతామని హెచ్చరించారు.