రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్‌లో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా రామ్ పోతినేని మాట్లాడుతూ,’ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ వాడు. యాక్ట్ చేస్తున్నపుడు నాకు వచ్చిన కిక్ వేరు. అలాంటి మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ క్యారెక్టర్‌తో ఒక కిక్-యాస్ స్క్రిప్ట్ ఉంటే ఎలా ఉంటుందని అనుకున్నాం. అప్పుడు ఈ ‘డబుల్ ఇస్మార్ట్’ స్క్రిప్ట్ రాశారు. ఇదొక పక్కా మాస్ కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమా హిట్ అయ్యిందంటే వచ్చే కిక్కే వేరు. అలాంటి కిక్కు ఈ సినిమాతో నాకు మళ్ళీ వస్తుందని ఆశిస్తున్నా. డబుల్ మ్యాడ్‌నెస్‌తో ఈ సినిమాని థియేటర్లలో అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సినిమా నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాని అంత బాగా పూరి తెరకెక్కించారు’ అని అని తెలిపారు. ఈ సినిమా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.