డబుల్‌ థ్రిల్‌ ఇచ్చే సినిమా

డబుల్‌ థ్రిల్‌ ఇచ్చే సినిమాబ్ల్లాక్‌బస్టర్‌ సాధించిన ‘మత్తు వదలరా’ చిత్రానికి సీక్వెల్‌గా ‘మత్తువదలారా 2′ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. శ్రీ సింహ కోడూరి లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్‌ రానా దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను మేకర్స్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీ సింహ కోడూరి మాట్లాడుతూ,’ఈ సినిమా గురించి పెద్దగా ఏం చెప్పాల్సిన అవసరం లేకుండా పార్ట్‌ 1ని ప్రేక్షకులు పెద్ద హిట్‌ చేశారు. ఫస్ట్‌ పార్ట్‌ని థియేటర్స్‌లో ఎలా మిస్‌ అయ్యామని, థియేటర్స్‌లో చూసుంటే ఎక్స్‌పీరియన్స్‌ ఇంకా అదిరిపోయేదని కొంతమంది మెసేజ్‌లు చేశారు. వారందరి కోసం డబుల్‌ ది ఫన్‌, థ్రిల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉండేలా సెకండ్‌ పార్ట్‌ చేశాం. సెప్టెంబర్‌ 13న థియేటర్స్‌లోకి ఈ సినిమా వస్తుంది. అందరూ చూసి ఎంజారు చేయండి’ అని చెప్పారు. ‘ఈ సినిమా చాలా ఫన్‌ జర్నీ. మూవీ చూసినప్పుడు మీకూ అర్ధమౌతోంది. ఈ సినిమాలో ఓ పాట రాయడంతో పాటు పాడాను. అలాగే కొరియోగ్రఫీ కూడా చేశాను’ అని హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా అన్నారు. డైరెక్టర్‌ రితేష్‌ రానా మాట్లాడుతూ,’ఫస్ట్‌ పార్ట్‌ లోనే ఒక ఐడియాని ప్లాంట్‌ చేసి దాని నుంచి డైరెక్ట్‌ సీక్వెల్‌గా పార్ట్‌ 2 చేశాం. అందరూ మత్తువదలరా మరోసారి చూసొస్తే ఇంకా బాగా ఈ సినిమాని ఎంజారు చేస్తారు’ అని తెలిపారు. నిర్మాత వై రవిశంకర్‌ మాట్లాడుతూ,’ఇది చాలా పెద్ద సినియా అవుతుందనే కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. టీజర్‌ చూశాక ష్యూర్‌ షాట్‌ హిట్‌ అనిపించింది. ఆ వీక్‌ మ్యాన్‌ అఫ్‌ ది మ్యాచ్‌ సినిమా ఇదే అవుతుంది’ అని అన్నారు. ‘మత్తువదలరాతో నేను, తమ్ముడు పరిచయం అయ్యాం. ఈ సీక్వెల్‌కి పని చేయటం ఆనందంగా ఉంది’ అని మ్యూజిక్‌ డైరెక్టర్‌ కాల భైరవ చెప్పారు.