
2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసిలో భాగంగా జిల్లాలోని 49 మద్యం షాపుల కేటాయింపుకు ఈనెల 21న సోమవారం ఉదయం 11 గంటలకు సిరిసిల్ల రోడ్డు లోని రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్ లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా డ్రా తీయనున్నామని ఆబ్కారీ శాఖ పర్యవేక్షకులు రవీందర్ రాజు ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. నూతన మద్యం పాలసీ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈనెల 4 నుండి 18 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం విధితమే. ఇందుకోసం జిల్లాలో 2,174 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారులు అందరు సోమవారం ఉదయం 10 గంటల వరకు ఫంక్షన్ హాల్ కు ఎంట్రీ పాసులతో హాజరు కావలసిందిగా ఆయన సూచించారు. దరఖాస్తుదారుడు హాజరు కానట్లయితే వారికి సంబంధించి టోకెన్ నెంబర్ డ్రాలో వేయబడదని స్పష్టం చేశారు. కావున దరఖాస్తుదారుడు తమ ఎంట్రీ పాసులతో విధిగా ఫంక్షన్ హల్లో జరిగే డ్రా కు హాజరు కావలసిందిగా రవీందర్ రాజు స్పష్టం చేశారు