
నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లిజిల్లా మల్హర్ రావు మండలంలోని చిన్నతూoడ్ల గ్రామపరిదిలో దుబ్బజాతర, పెద్ధపల్లి జిల్లా ఖమ్మంపల్లిలో సందరెల్లిలో సమ్మక్క,సారలమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మండలంలో దుబ్బ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. రెండేండ్ల కోమారు ఆనవాయితీగా మహ మేడారం జాతర ఉత్సవాల నేపథ్యంలో నిండు పౌర్ణమి వేళలో జాతర నిర్వహిస్తారు. చిన్నతూండ్ల గ్రామంలోని గౌడ కులస్థుల ఆధ్వర్యంలో బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్క కుంకుమ భరణిలను ప్రతిష్టించి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.అమ్మవార్లు నమ్మిన వారికి ఇలవేల్పుగా కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తులకు ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) పసుపు, కుంకుమ, ఎదురు పిల్లలు తదితరవి సమర్పించారు. కార్యక్రమానికి ముందుగా మహిళలు నియమనిష్ఠలతో బోనాలు సమర్పించారు. జాతర ప్రాంగణంలో లక్ష్మి దేవర, శివ సత్తుల పునాకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ జాతరకు మండలంలోని చిన్నతూoడ్ల,పెద్దతూoడ్ల,మల్లారం,తాడిచెర్ల, అడ్వాలపల్లి,దుబ్బపేట గ్రామాల్లో నుంచే కాకుండా కాటారం,భూపాలపల్లి పట్టణాల నుంచి సుమారుగా రెండు వేలమంది సందర్శకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు,తో పాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, సందర్శకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.