ఒరిగిన విద్యుత్ స్తంభం.. పొంచి ఉన్న ప్రమాదం

– ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ – ముత్తారం
ముత్తారం మండలం పారుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని శాత్రాజులపల్లి అమ్లెట్ విలేజిలో బండారి రవికి చెందిన పంట పొలంలో 11 కెవి విద్యుత్ స్తంభం ఒకవైపుగా ఒరిగింది. గత కొద్దిరోజు లుగా వీస్తున్న ఈదురు గాలుల కారణంగా ఈ విద్యుత్ స్తంభం ఓ వైపు ఒరిగింది. దీంతో ఆ రైతు ఎప్పుడు జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నాడు. గత 20 రోజుల నుంచి పరిస్థితి ఇదే విధంగా ఉందని, దీనిపై తాను అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని సదరు రైతు బండారు రవి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ నెలకొరిగి ప్రమాదం జరగక ముందే సంబంధిత శాఖ అధికారులు స్పందించి, ఒరిగిన విద్యుత్ స్తంభాన్ని పునరుద్ధరించాలని సదరు రైతు కోరుతున్నాడు.