నవతెలంగాణ – జన్నారం
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని, మంచిర్యాల జిల్లా డిఆర్డిఏ పిడి జన్నారం మండల స్పెషల్ ఆఫీసర్ కిషన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కార్యదర్శులు అంగన్వాడీ టీచర్లు ఐకెపి సిబ్బంది, కి సమగ్ర సర్వేపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కుటుంబ సర్వేలో సామాజిక ఆర్థిక కుల విద్యా ఉపాధి రాజకీయ అంశాలపై పూర్తిస్థాయిలో ప్రతి కుటుంబానికి సర్వే నిర్వహిస్తామన్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజలు వారికి సంబంధించిన అన్ని సమాచారాన్ని సర్వేకు వచ్చిన అధికారులకు అందించాలన్నారు. ఈ సమగ్ర కుటుంబ సర్వే ని పగడ్బందీగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శశికళ పిఓపిఆర్డి జలంధర్, వివిధ గ్రామాలకు చెందిన కార్యదర్శులు అంగన్వాడీ టీచర్లు ఐకెపి సిబ్బంది స్పెషల్ అధికారులు పాల్గొన్నారు.