విజయ్ ఆంటోనీ నటించిన తాజా సినిమా ‘లవ్ గురు’. ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్‌లో నటించిన చిత్రమిది. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఈ నెల 11న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో హీరో విజయ్ ఆంటోనీ మీడియాతో మాట్లాడుతూ, ‘ఇందులో ఫెంటాస్టిక్ ఫ్యామిలీ కామెడీ చూస్తారు. సినిమా చూశాక మీ జీవిత భాగస్వామిని ప్రేమించడం ఏలాగో తెలుసుకుంటారు. దర్శకుడు తన లైఫ్‌లో చూసిన అనుభవాలతో ఈ కథను రెడీ చేశాడు. ఈ కథలో హీరో క్యారెక్టర్ ప్రేమను పంచుతుంది. ప్రేమిస్తుంది. అతన్ని ద్వేషించినా వారిని లవ్ చేస్తుంది. నేను ఫ్యూచర్‌లో ఎంత గొప్ప సినిమా చేసినా అది బిచ్చగాడు సినిమా కంటే గొప్ప మూవీ కాలేదు. అయితే లవ్ గురు కూడా నాకు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని అందిస్తుంది. ఇందులో లేడీస్ సెంటిమెంట్ ఉంటుంది. 2026 సమ్మర్‌లో బిచ్చగాడు 3 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఈ సినిమాకు నేనే దర్శకత్వం చేస్తాననుకుంటా. ప్రస్తుతం మా ప్రొడక్షన్ మూడు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఒకటి అక్టోబర్‌లో, మరొకటి సంక్రాంతికి, ఇంకో సినిమా నెక్ట్ సమ్మర్‌లో రిలీజ్ చేయబోతున్నాం.