నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులకు బుధవారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించి, ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బద్దం పద్మ చిన్నారెడ్డి దంపతులను, ఉప సర్పంచ్ నందగిరి రేఖ శ్రీధర్ దంపతులను, వార్డు సభ్యులను గ్రామపంచాయతీ కార్యదర్శి నరేందర్ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పద్మ చిన్నారెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ గా గెలిపించి గ్రామ అభివృద్ధికి పాటుపడేలా సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా గ్రామ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు.అనంతరం సర్పంచ్ దంపతులు తమ పదవి కాలంలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన అంగన్వాడీ టీచర్లను, ఆశా కార్యకర్తలను, మహిళా సంఘాల వివో ఏ లను, పంచాయతీ పారిశుధ్య, ఇతర సిబ్బందిని శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు పిప్పేర అనిల్, పంచాయతీ కార్యదర్శి నరేందర్, ఏఎన్ఎం అరుణ, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.