
మండలంలోని ఆయా గ్రామాల్లో ఐదు సంవత్సరాల పదవి కాలాన్ని పూర్తి చేసుకున్న తాజా మాజీ సర్పంచ్ లను శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా సన్మానించారు. ఎంపీపీ అధ్యక్షురాలు లోలపు గౌతమి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల సర్పంచులను శాలువాలు కప్పి, జ్ఞాపికాలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర ఎంతో ప్రత్యేకమైనది అన్నారు. ప్రజల కోసం అన్ని గ్రామాల సర్పంచులు ఎంతో ఉత్సాహంతో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలుపరిచారన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించడం ద్వారా ప్రజలకు సేవ అవకాశం కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచులు గడ్డం స్వామి, సక్కారం అశోక్, మారు శంకర్, పుప్పల గంగాధర్, పెండే ప్రభాకర్, నునావత్ లస్కర్, దయ్య దేవయ్య, గుగులోతు భాస్కర్, పాలెపు సాయమ్మ, లకావతి చిన్ని, బద్దం పద్మ చిన్నారెడ్డి, ఇంద్రాల రూప రాజేందర్, ఏనుగు పద్మ రాజేశ్వర్, అమరగొని రోజా సదాశివ గౌడ్, వైస్ ఎంపీపీ కాలేరు శేఖర్, ఎంపీటీసీ సభ్యులు పిప్పెర అనిల్, మైలారం సుధాకర్, నోముల రజిత, ఏశాల నరసయ్య, దుబ్బాక సుప్రియ, తోట జ్యోతి, బుస్సాపురం సుప్రియ, లకావత్ గంగాధర్, కో ఆప్షన్ సభ్యుడు అజ్మత్ హుస్సేన్, మండల పరిషత్ కార్యాలయ సూపరిండెంట్ మైలారం గంగాధర్, మండల పంచాయతీ అధికారి సదాశివ్, మండల విద్యాధికారి ఆంధ్రయ్య, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.