పొలం పట్టా చేస్తాడో లేదో అని దిగులుతో రైతు ఆత్మహత్య..

నవతెలంగాణ – నాగిరెడ్డిపెట్
నాగిరెడ్డి పేట మండలంలోని ఎర్రకుంట తండా కు చెందిన మలావత్ కెవ్ల (36)  తన పెద్దన్న సకృ పొలం పట్టా చేస్తాడో లేదో అనేది గుర్తుతెలియని విషపూరిత మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రోజు రాత్రి చోటుచేసుకుంది. ఏఎస్ఐ ఉమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగిరెడ్డిపేట మండలంలోని ఎర్రకుంట తండా కు చెందిన మలావత్ కేవ్ల తన పెద్దన్న సక్రు పొలం పట్టా చేస్తాడో లేదో అనే దిగులతో ఆదివారం రోజు కల్లు సీసాలో విషపూరితమందు కలుపుకొని తాగి ఆకస్మారాస్థితిలో పడి ఉండడంతో గమనించిన కుటుంబీకులు వెంటనే ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కేవ్లా మృతి చెందినట్లు తెలపడం జరిగిందన్నారు. భార్య యమునా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.