విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న రైతు..

– మోటార్, వైర్ లు స్వాధీనం చేసుకున్న విద్యుత్ సిబ్బంది..
నవతెలంగాణ – అశ్వారావుపేట
అధికారం,ఆర్ధిక పరపతి ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటారు కొందరు.ఇవి తారుమారు అయితేనే అసలు విషయం తేటతెల్లం అవుతుంది.మండల పరిధిలోని నారాయణపురం కు చెందిన గతంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తన వ్యవసాయానికి గత కొన్నేళ్ళుగా అక్రమ విద్యుత్ వినియోగం చేస్తున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది.తన వ్యవసాయ క్షేత్రం సమీపంలో గల వాగులో నుండి నీటిని వ్యవసాయ సాగుకు వినియోగించడం కోసం అదే సమీపంలోని విద్యుత్ లైన్ అక్రమ కనెక్షన్ తో విద్యుత్ ను వాడుకుంటున్నాడు.ఇదే వ్యక్తి గతం ప్రభుత్వం హయాంలో అధికారి దుర్వినియోగానికి పాల్పడినట్లు ఇపుడిపుడే బహిర్గతం అవుతుంది.ఈ విషయం పై అదే గ్రామానికి చెందిన రైతులు కొందరు స్థానిక విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నా చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా స్థాయి అధికారులకు పిర్యాదు చేయడంతో స్పందించిన స్థానిక సిబ్బంది మూడురోజుల క్రితం యుద్ద ప్రాతిపదికన విద్యుత్ మోటార్ ను,వైర్ లను స్వాధీనం చేసుకున్నారు.కానీ ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం పై పలు విమర్శలూ వస్తున్నాయి.విద్యుత్ సరఫరా నిలిపి వేసి విచారణ చేస్తున్నాం – ఎన్.పి.డి.సి.ఎల్ వినాయకపురం సబ్ స్టేషన్ ఎఇ సంతోష్.ఈ విషయం అయి ఎఇ సంతోష్ ను వివరణ కోరగా విద్యుత్ సరఫరా నిలుపుదల చేసాం.విచారణ చేస్తున్నాం.పై అధికారుల ఆదేశానుసారం విద్యుత్ చౌర్యం కేసు నమోదు చేస్తాం అని తెలిపారు.