
మండలంలోని కల్వకుంట గ్రామానికి కూలి పనికి వచ్చిన మహిళ పత్తి తీస్తుండగా బంగారు గొలుసు పడిపోయినది. ఆరోజు ఎంత వెతికినా గాని బంగారు గొలుసు దొరకపోవడంతో ఆ మహిళ తీవ్ర మునస్థాపం చెందింది. అదే గ్రామానికి చెందిన బొందు యాదయ్య ఈ ఏడాది వ్యవసాయ పనుల్లో భాగంగా అదే పత్తి చేనులో గుంటుక కొడుతుండగా బంగారు గొలుసు నాగలికి తలిగి రైతు యాదయ్యకు కనపడడంతో గొలుసును బాధితురాలికి ఇచ్చేందుకు వెంటనే ఆ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కు ఫోన్ చేసి పోయిన బంగారు గొలుసు దొరికిందని బాధితురాలకు చెప్పడంతో, ఆనందపడి దొరికిన గొలుసును బాధితురాలకి ఇచ్చి రైతు యాదయ్య మానవత్వాన్ని చాటుకోవడంతో కూలి పనులకు వచ్చిన కూలీలు, ఆ గ్రామంలోని రైతులు యాదయ్యను అభినందించారు.