యూత్‌కి బాగా నచ్చే జమాన

యూత్‌కి బాగా నచ్చే జమానమంచి కథాబలంతో ఈ తరం యువత ఆలోచనలకు అద్దం పట్టే ఆసక్తికరమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘జమాన’. ‘బ్రో’ సినిమాతో సుపరిచితుడైన సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా శ్రీ లక్ష్మీ వల్లభ క్రియేషన్స్‌, విఎస్‌ అసోసియేట్స్‌ పతాకాలపై తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
తాజాగా ఈ చిత్ర టైటిల్‌ ప్రోమోను దర్శకుడు వెంకీ కుడుముల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘టైటిల్‌ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. దర్శకుడు మంచి కథని ఎంపిక చేసుకున్నారు. ఆయన విజన్‌ కూడా చాలా బాగుంది. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు. ‘నేటి యువతకు సంబంధించి ఒక అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యేలా మా దర్శకుడు మంచి విజన్‌తో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు’ అని హీరో సూర్య శ్రీనివాస్‌ చెప్పారు.
దర్శకుడు భాస్కర్‌ జక్కుల మాట్లాడుతూ, ‘ఛార్మినార్‌, ఓల్డ్‌ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌కి నచ్చే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం’ అని చెప్పారు.