ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌

A feel good entertainerసాయికుమార్‌ మరో ఫెరోషియస్‌ పాత్రతో ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్‌ చెయ్యబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రణయగోదారి’. ఇందులో పెదకాపు అనే పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించబోతున్నారు. పిఎల్‌ విఘ్నేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హాస్యనటుడు అలీ కుటుంబానికి చెందిన సదన్‌ హీరోగా నటిస్తున్నారు. ప్రియాంక ప్రసాద్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్‌ రావినూతల ముఖ్య పాత్రలో నటిసున్నారు. పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయికుమార్‌ లుక్‌ పోస్టర్‌ను శుక్రవారం తెలంగాణ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మా మునుగోడు ప్రాంతానికి చెందిన పారుమళ్ళ లింగయ్య ఇలాంటి మంచి సినిమాను నిర్మించినందుకు అభినందనలు. ఆయనకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణతో మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, ‘ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల వారిని అలరిస్తుంది. టైటిల్‌కి తగ్గట్టుగా నేచురల్‌ లొకేషన్స్‌లో చిత్రీకరణ చేస్తున్నాం. గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాలు చిత్రంలో కనిపిస్తాయి. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చెప్పారు.