ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ

ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీఓ డిఫరెంట్‌ కంటెంట్‌తో ‘ప్రణయ గోదారి’ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. పిఎల్‌ విఘ్నేష్‌ దర్శకత్వంలో ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కమెడియన్‌ అలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు సదన్‌, ప్రియాంక ప్రసాద్‌, సునీల్‌ రావినూతల, 30 ఇయర్స్‌ పథ్వీ, సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. పిఎల్‌వి క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పారమళ్ళ లింగయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్న యూనిట్‌.. జోరుగా ప్రమోషన్స్‌ కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీలో నుంచి ఫీల్‌ గుడ్‌ సాంగ్‌ను సంగీత దర్శకులు కోటి చేతుల మీదుగా లాంచ్‌ చేశారు. ‘కలలో కలలో..’ అంటూ సాగిపోతున్న ఈ ప్రేమ గీతంలో లవ్‌ బీట్‌ అదిరిపోయిందని చెప్పుకోవాలి. ఇక గోదావరి అందాలు, నేచురల్‌ లొకేషన్స్‌లో చిత్రీకరణ చేసిన సీన్స్‌ ఫ్రెష్‌ ఫీలింగ్‌ తెప్పిస్తున్నాయి. హీరో, హీరోయిన్‌ కాస్ట్యూమ్స్‌తో పాటు సైడ్‌ డాన్సర్ల లుక్స్‌ కూడా ఈ పాటలో ఆకర్షణీయంగా మారాయి. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కోటి మాట్లాడుతూ, ‘ఈ సాంగ్‌ చూస్తుంటే ఫ్రెష్‌ ఫీలింగ్‌ కలుగుతోంది. అన్ని వర్గాల ఆడియెన్స్‌ మెచ్చేలా ఈ సాంగ్‌ షూట్‌ చేశారు. పాటలోని లిరిక్స్‌, బీట్‌, అందుకు తగ్గ సన్నివేశాలు, నటీనటుల వేషధారణ అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి’ అని తెలిపారు. ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ అనుభూతితోపాటు యువతను ఆకర్షించే ఎన్నో పాయింట్స్‌ కలగలిపి రాబోతున్న ఈ సినిమాకు మార్కండేయ సంగీతం అందిస్తున్నారు.