హ్యాపీ లివింగ్ ఎంటర్టైన్మెంట్, సహస్ర మూవీస్ పతాకాలపై నిర్మాతలు శ్రీనుబాబు పుల్లేటి, సత్తిబాబు మోటూరి నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘ఓరు ఇడియట్’. న్యూ ఏజ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో యశ్వంత్ యజ్జవరుపు, త్రిప్తి శంకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వెంకట్ కడలి దర్శకుడిగా పరిచయ మవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ‘ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఈ టీనేజ్ లవ్ స్టోరీని దర్శకుడు స్క్రీన్ మీద ఆహ్లాదకరంగా చూపించారు. మంచి సంగీతం కుదిరింది. యశ్వంత్ యజ్జవరుపు, త్రిప్తి శంకర్ వారి పాత్రలలో చక్కగా నటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యింది. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం. ఈ సినిమా పెద్ద విజయం సాధించి మా అందరికి మంచి పేరు తెచ్చి పెడుతుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.