‘సీతారామం’ హ్యూజ్ బ్లాక్‌బస్టర్‌తో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దర్శకుడు హను రాఘవపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ప్రభాస్‌తో యాక్షన్ అంశాలతో ఉండే ఫిక్షనల్ పీరియాడిక్ చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కించబోతున్నారు. వరంగల్‌లోని ఎన్‌ఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో హను రాఘవపూడి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ ప్రభాస్‌తో తన సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు. ‘ప్రభాస్‌తో నా నెక్స్ట్ చిత్రం హిస్టరీ ఆల్టర్నేటివ్ నెరేటివ్‌తో కూడిన పీరియాడికల్ యాక్షన్’ అని అన్నారు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే మూడు పాటలను కంపోజ్ చేసినట్లు ఆయన తెలియజేశారు.ఈ డెడ్లీ కాంబినేషన్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో తెలియ జేయనున్నారు.